Sunday, November 15, 2015

సగ్గుబియ్యం కిచిడీ

కావలసిన పదార్థాలు:

 సగ్గుబియ్యం - 1 కప్పు, వేగించిన పల్లీ పొడి - పావు కప్పు, పచ్చిబఠాణి - పావు కప్పు, మొక్కజొన్న గింజలు - పావు కప్పు, తరిగిన పచ్చికొబ్బరి - 2 టేబుల్‌ స్పూన్లు, పచ్చిమిర్చి - 4, ఉప్పు - రుచికి తగినంత, నిమ్మరసం - 1 టేబుల్‌ స్పూను, తాలింపు గింజలు - తగినన్ని, నూనె + నెయ్యి - టీ స్పూను చొప్పున.

తయారుచేసే విధానం: సగ్గుబియ్యాన్ని గంటసేపు నానబెట్టి, నీరు వంచేసి బట్టమీద నెరిపి మరో గంట ఆరబెట్టాలి. పచ్చిబఠాణి, మొక్కజొన్నగింజల్ని కొద్ది నీటిలో 3 నిమిషాలు ఉడికించాలి. కడాయిలో తాలింపు వేశాక పచ్చిమిర్చి, బఠాణి, మొక్కజొన్న గింజలు వేగించాలి. నిమిషం తర్వాత సగ్గుబియ్యం వేసి ఉప్పు చల్లాలి. పదినిమిషాలు సన్నని మంటపై ఉడికించాక పల్లీపొడి, కొబ్బరితురుము, నిమ్మరసం కలిపి దించేయాలి. వేడి వేడి కిచిడీని మీ కిష్టమైన పచ్చడితో తినండి.

0 comments:

Post a Comment